ఓలా ఎలక్ట్రిక్ తన నూతన స్కూటర్ల శ్రేణిని ప్రవేశపెట్టింది. ఓలా గిగ్, గిగ్+, S1 Z, S1 Z+ మోడల్స్‌ను రూ. 39,999 నుండి రూ. 64,999 వరకు ధరలతో అందుబాటులోకి తెచ్చింది (ఎక్స్-షోరూమ్). కస్టమర్లు వీటిని ఓలా అధికారిక వెబ్‌సైట్ ద్వారా కేవలం రూ. 499తో బుక్ చేసుకోవచ్చు.
ఓలా గిగ్ కేవలం చిన్న ప్రయాణాల కోసం రూపొందించబడింది. దీని 1.5 kWh పునర్వినియోగ బ్యాటరీ 112 కిమీ రేంజ్‌ను మరియు గరిష్ట వేగం 25 kmph అందిస్తుంది. 12 అంగుళాల టైర్లతో కూడిన సింపుల్ డిజైన్ కలిగిన ఈ స్కూటర్ B2B వినియోగదారుల కోసం తక్కువ ధరలో అందుబాటులో ఉంది. గిగ్ శ్రేణి డెలివరీలు ఏప్రిల్ 2025లో ప్రారంభమవుతాయి.
ఆటోమేటిక్ రేంజ్ కోసం ఓలా గిగ్+ 157 కిమీ రేంజ్, 45 kmph వేగం అందిస్తుంది. ఇది రూ. 49,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.
నగర ప్రయాణికుల కోసం ఓలా S1 Z 146 కిమీ రేంజ్, 70 kmph గరిష్ట వేగాన్ని అందిస్తుంది. దాని తేలికైన బరువు, LCD స్క్రీన్, 2.9 kW హబ్ మోటార్ ప్రత్యేకతలు. ఇది రూ. 59,999తో అందుబాటులో ఉంది.
భారీ అవసరాల కోసం S1 Z+ ఎక్కువ లోడింగ్ సామర్థ్యంతో రూపొందించబడింది. ఇది వ్యక్తిగత మరియు వ్యాపార వినియోగదారుల కోసం సరైన ఎంపిక. మే 2025లో డెలివరీలు ప్రారంభమవుతాయి.
Ola, తన పవర్‌పాడ్ పరిష్కారంతో స్కూటర్ల బ్యాటరీలను ఇంటి అవసరాలకు ఇన్వర్టర్‌లుగా ఉపయోగించగలిగేలా చేసింది.